NLR: నగరంలోని 11 కేవీ ఏపీ టూరిజం విద్యుత్ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, రాజరాజేశ్వరి దేవస్థానం రోడ్డు, రామాలయం వీధి పరిసర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని టౌన్ ఈఈ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


