KKD: రత్నగిరిపై నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొండపైన వనదుర్గమ్మ, కొండదిగువన కనకదుర్గమ్మ ప్రతిరోజూ ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
అన్నవరంలో నేటి నుంచి శరన్నవరాత్రి వేడుకలు


