హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాస్వామ్యం పేరుతో అశాంతిని సహించబోం: సీఎం

ఢిల్లీ నిరసనల నేపథ్యంలో విపక్షాలపై సీఎం రేఖా గుప్తా తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు తమ రాజకీయ అసహనాన్ని ప్రజలపై చూపిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్, ఆప్ అధినేత కేజ్రీవాల్ సీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.