హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్న తల్లిని మోసం చేసిన కూతురు

GNTR: భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటున్న తెనాలి రూరల్‌కు చెందిన దుర్గ తన వద్ద ఉన్న 32 సవర్ల బంగారు నగలను భద్రపరచాలని కూతురు ఆదిలక్ష్మికి ఇచ్చింది. అయితే, కూతురు తన కుటుంబంతో కలిసి ఆ నగలను అమ్మేసి మోసం చేసిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.