HNK: విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, ఆధునీకరణకు శనివారం హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ రూ.1.85 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఉపసంచాలకుడు ధనరాజ్ తెలిపారు. తొలి విడతగా రూ.89.50లక్షలు విడుదలయ్యాయి. ఆధునీకరణ పనుల నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి డెయిరీలో ప్యాకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, రావిర్యాల మెగాడెయిరీ నుంచి పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని సూచించారు.
తెలంగాణ
విజయ తెలంగాణ డెయిరీకి నిధులు మంజూరు


