హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అందుబాటులో ఉండని డీఎల్‌పీఓ అధికారి?'

PPM: మన్యం జిల్లా డీఎల్‌పీఓ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లినప్పటికీ అధికారి అందుబాటులో ఉండటం లేదని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తగిన శ్రద్ధచూపడం లేదని, కార్యాలయ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.