హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిల్పూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

JN: చిల్పూర్ మండలం క్రిష్ణాజిగూడెంలో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మల్లం రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.