హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

AKP: కోటవురట్ల మండలం లింగాపురం జంక్షన్‌లో అయ్యప్ప దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి భవాని మాలలు ధరించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని మాలలు ధరించిన భక్తులతో ఆలయం ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.