హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనకదుర్గమ్మ ఉత్సవాలకు భద్రత కల్పించాలి'

అన్నమయ్య: రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ దసరా ఉత్సవాలకు పటిష్ఠ భద్రత కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పోలీసులను కోరారు. మన్నూరు రూరల్ సీఐ లింగప్పను కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.