BPT: అద్దంకి రాజీవ్ కాలనీలో సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు 'డ్రగ్స్ వద్దు జీవితాలు ముద్దు' నినాదంతో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని కాలనీవాసులకు సీఐ సూచించారు. నిషేధిత గంజాయి సేవించినా, అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి సేవిస్తే కఠిన చర్యలు: సీఐ


