ASR: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్ సిలిమేట గ్రామంలో గిరిజనులు తాము సాగు చేస్తున్న గంజాయి తోటలను స్వయంగా దహనం చేశారు. ఏపీ ఈగల్ బృందం సమాచారంతో ఒడిశా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించడంతో గిరిజనులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు గిరిజనులను అభినందించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసి ఆదుకోవాలని గిరిజనులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి తోటలను దగ్ధం చేసిన గిరిజనులు


