హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంటైనర్ ఢీకొని వృద్ధుడు మృతి

కోనసీమ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధుడిని కంటైనర్ ఢీకొట్టడంతో ఆయన మృతి చెందిన ఘటన శనివారం కొత్తపేట మారుతీ సెంటర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, కొత్తపేటకు చెందిన గాదరాజు సూర్యనారాయణరాజు (74) కండ్రిగ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి. సురేంద్ర తెలిపారు.