హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కాకినాడ పోలీస్ కార్యాలయం లో PGRS రద్దు: ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీ సోమవారం జరగాల్సిన PGRS రద్దు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అదే రోజు కాకినాడలో CII సదస్సు జరుగుతున్నందున పోలీస్ అధికారులంతా భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దయిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.