అనకాపల్లి మండలం సంపతిపురం వద్ద రెండు కిలోల గంజాయితో పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. నిన్న వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన స్కూటీని తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. నిందితుడు చేపల ఉప్పాడకు చెందిన మధుసూదన్‌గా గుర్తించి, గంజాయితో పాటు స్కూటీని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంపతిపురం వద్ద 2 కిలోల గంజాయి పట్టివేత


