హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరప లో మారిన అగ్రిగోల్డ్ బాండ్ల వెరిఫికేషన్ కేంద్రం

KKD: కరప మండల అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల వెరిఫికేషన్ కేంద్రాన్ని మార్చినట్లు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం శనివారం వెల్లడించింది. ఈ నెల 12న నిర్వహించే వెరిఫికేషన్ ప్రక్రియను పాత ఎస్పీ కార్యాలయం నుంచి పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని పోలీస్ కళ్యాణ మండపానికి మార్చినట్లు తెలిపింది. డిపాజిటర్లు అవసరమైన సర్టిఫికెట్లతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.