హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్ద రైల్వే గేట్ మూసివేత

KKD: తుని పెద్ద రైల్వే గేట్ను మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. రైల్వే పనుల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ వరకు గేటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటున్నాయి. వాహనదారులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.