అంతర్వేది పల్లిపాలెం తీరంలో రింగ్ వలలు, లాగుడు వలల వివాదంపై శనివారం సంప్రదాయ మత్స్యకారులు ధర్నా చేశారు. ఇతర ప్రాంతాల వారు తీరం సమీపంలో ఈ వలలతో వేట చేయడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని స్థానికులు వాపోయారు. చిన్న చేపలు నశించి సముద్ర సంపద తరిగిపోతోందని ఆవేదన చెందారు. మెరైన్ ఫిషింగ్ చట్టం అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్వేది తీరంలో వలల వివాదం.. మత్స్యకారులు నిరసన


