హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి దసరా వేడుకలు..!

KDP: ఒంటిమిట్టలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సోమిశెట్టి మనోహరాబాబు తెలిపారు. ఆదివారం కలశస్థాపన, అభిషేకం, సహస్రనామ పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.