KRNL: ఆలూరు మండలం దేవరగట్టు శ్రీ మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నేపథ్యంలో పత్తికొండ డీఎస్పీ వంశీధర్ గౌడ్ ఏర్పాట్లను శనివారం సాయంత్రం పరిశీలించారు. ఉత్సవానికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
దేవరగట్టు బన్నీ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలన


