హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పాలకొండలో ట్రాఫిక్ ఆంక్షలు

PPM: పాలకొండ కోటదుర్గమ్మ దసరా ఉత్సవాల సందర్భంగా ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. పది రోజులపాటు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. రాజాం, విశాఖ, వీరఘట్టం, పార్వతీపురం నుంచి వచ్చే వాహనాలు అన్నవరం, వడమ మీదుగా రావాలన్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస వాహనాలను ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారిపై అనుమతించమన్నారు.