హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: కార్వేటినగరం సబ్ డివిజన్ పరిధిలోని వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ ఉండదని ఆ శాఖ ఏడీ చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉప కేంద్రాల్లో మరమ్మతులు చేపడుతున్నందున సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు గమనించాలని సూచించారు.