హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షిలో నేటి నుంచి శరన్నవరాత్రులు

SS: లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయం లోపల, వెలుపల, రహదారుల్లో విద్యుత్తు దీపాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పరిగి వేణుగోపాల్ రావు, ఈవో నరసింహమూర్తి తెలిపారు.