హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్..!

కడప: జిల్లాలో మిగిలిపోయిన 32 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించి, 21న లాటరీ ద్వారా దుకాణాలు కేటాయించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు సంబంధిత ఎక్సైజ్ సీఐలను సంప్రదించాలని అధికారులు తెలిపారు.