హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ తేదీల్లో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

ATP: జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల బాండ్ల పరిశీలన ఈనెల 12 నుంచి అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని షాదీఖానాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 12న లేపాక్షి, రొద్దం, 13న బొమ్మనహాల్, కంబదూరు. 14న కూడేరు, ఓబుళదేవరచెరువు, 15న సోమందేపల్లి, 16న డి.హీరేహాళ్, 17న బ్రహ్మసముద్రం మండలాల బాధితులు, ఏజెంట్లు తమ బాండ్లతో హాజరుకావాలని సూచించారు.