హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలులో రూ.6.28 కోట్లతో అభివృద్ధి పనులు

ప్రకాశం: ఒంగోలు నగరంలో రూ.6.28 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. సమతానగర్, 60 అడుగుల రోడ్డులో సీసీ డ్రైన్ల నిర్మాణంతో పాటు పలు కూడళ్లలో హెరిటేజ్ పైలాన్, క్లాక్ టవర్, గ్రానైట్ మాన్యుమెంట్, అశోక చక్ర స్తూపం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.