హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు..!

NTR: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ)లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, ఉత్సవ ఏర్పాట్ల విధుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.