హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!

కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. విజయవాడ నుంచి వస్తున్న బస్సుకు కురుమద్దాలి వద్ద అకస్మాత్తుగా ద్విచక్రవాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.