హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం సీఎస్‌ పురం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్‌ కేసులను సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా, రౌడీషీటర్ల పర్యవేక్షణ, వారెంట్ల అమలు, బైండోవర్‌ చర్యలు చేపట్టాలని సూచించారు.