హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాకాల బీచ్ బాధితుడికి కలెక్టర్ పరామర్శ

ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల బీచ్ ఘటనలో గాయపడి కందుకూరు కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనిగిరి మండలం శ్రీరంగపురానికి చెందిన బత్తుల నరసింహారావును కలెక్టర్ రాజాబాబు శనివారం రాత్రి పరామర్శించారు. అపస్మారక స్థితిలో వచ్చిన బాధితుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ సాకేత్‌ను అభినందించారు.