హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శిల్పారామంలో నృత్య ప్రదర్శన

VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రమణ తెలిపారు. నగరానికి చెందిన శ్రీసిద్ధేంద్రయోగి నాట్యాలయం చిన్నారులచే కూచిపూడి, జానపద నృత్యరూపకాల ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.