కృష్ణా: ఆగస్టు 22వ తేదీన కృత్తివెన్ను మండలం సంగమూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో రెండవ ముద్దాయిగా ఉన్న సంపంగి రాజేంద్ర(29)ను ఎస్ఐ పైడి బాబు ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన 20 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కాలిగట్ గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్..!


