ASR: కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించి, నెలకు రూ.10వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. నిన్న పాడేరులో CHWలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం రూ.4వేలే చెల్లిస్తున్నారని, ప్రభుత్వ సౌకర్యాలు, బీమా కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 12న ఐటీడీఏ ముట్టడిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
CHWలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి: CITU


