కృష్ణా: వర్షం పడితే సాలెంపాలెం నుంచి కోడూరుకు వెళ్లేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో వినియోగించే డొంక మార్గం వర్షం పడినప్పుడు బురదమయంగా మారి రాకపోకలకు పనికిరాకుండా పోతోంది. అధికారులు స్పందించి కోడూరు నుంచి సాలెం పాలెం వెళ్లేందుకు రోడ్డును మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షం పడితే.. అన్నీ ఇబ్బందులే!


