హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టగుంట వంతెనపై వాహన తనిఖీలు..!

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట వంతెన వద్ద ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. లారీలు, ఇతర భారీ వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. గడువు ముగిసిన పత్రాలు కలిగిన వాహనాలపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.