హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి టెన్నికాయిట్ పోటీలు

SKLM: పలాస క్రీడా మైదానంలో 11వ రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకుడు పి.తవిటయ్య తెలిపారు. ఇవాళ సాయంత్రం ప్రారంభమై మంగళవారం వరకు పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని, 6 కోర్టులు వేసి రాత్రి ఆటల కోసం ఫ్లడ్‌లైట్లు పెట్టామని చెప్పారు. ఈ పోటీల్లో 180 నుంచి 200 మంది పాల్గొంటారన్నారు.