అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పులిగొంది గ్రామానికి సరైన దారి లేక గిరిజన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ గ్రామానికి రోడ్డు వసతి కల్పించలేదని వాపోయారు. ఇల్లు కట్టుకోవడానికి ఇనుప రాడ్లను భుజాలపై మోస్తూ రాళ్ల దారిలో కష్టపడి వెళ్తున్నారు. తమ ఇబ్బందులను గుర్తించి కూటమి ప్రభుత్వ అధికారులు వెంటనే గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులు వెంటనే మాకు రోడ్ సదుపాయం కల్పించాలి


