ASF: కౌటాల మండలంలో వ్యవసాయానికి రోజుకు 20 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విద్యుత్ శాఖ AE అంజల్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. సకాలంలో కరెంట్ అందక పంటలు ఎండిపోతున్నాయని, డిమాండ్ నెరవేర్చకపోతే సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
20 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని వినతి


