హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

MNCL: మంచిర్యాలకు చెందిన బచ్చలి అక్షిత్ అనే ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించిన ఒక మహిళ బంగారం, వెండి ఆభరణాలు కలిగిన హ్యాండ్ పర్సు మరిచిపోయింది. కొంతసేపటికి గమనించిన అక్షిత్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అప్పగించారు. పర్సులో ఉన్న ఆధారాలతో మహిళను పిలిపించి సీఐ ప్రమోద్ రావు సమక్షంలో అందజేశారు.