హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరా మెరుగుపరచాలి: సుంకే రవిశంకర్

KNR: గంగాధర మండలం గర్షకుర్తి, తాడిజెర్రి గ్రామాల్లో ఎండుతున్న వరి పంటలను శనివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలను కాపాడేందుకు రోజుకు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఖర్చు చేసి నీరు పెడుతున్నారని తెలిపారు.