ATP: తాడిపత్రి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్


