హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపల్లి గోరిలో మటన్ ధరలకు రెక్కలు

BHPL: కొత్తపల్లి గోరి మండలంలో పండుగ నేపథ్యంలో మటన్ ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అధిక ధర ఉన్నా కొన్ని దుకాణాల్లో మటన్ దొరకడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ధరలు ఇంకా పెరుగుతాయేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.