హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి ఎమ్మెల్యేతో ఏపీ టిడ్కో ఛైర్మన్ భేటీ

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డిని ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించారు. భేటీలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.