హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వైద్య రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం'

కృష్ణా: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. కృతివెన్ను మండలం నిడమర్రు పంచాయతీలోని పోదుమాట్లం గ్రామాలలో రూ.68.60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రాలను శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంచడమే ధ్యేయమని తెలిపారు.