హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో పిల్లలు జాగ్రత్త!

NLR: దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని చేజర్ల SI అయ్యప్ప హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సరదాల కోసం పిల్లలు కాలువలు, చెరువులు, క్వారీలు సముద్రం వంటి ప్రాంతాలకు వెళ్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలకు జాగ్రత్తలు చెప్పి హెచ్చరించాలన్నారు.