హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ సర్వేకు సహకరించాలి: తహశీల్దార్

PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ పేటలో సర్పంచ్ జ్యోత్స్న ఆధ్వర్యంలో భూముల రీ సర్వేపై గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ రాపెల్లి రాముడు సర్వే ప్రాముఖ్యతను వివరించి, రైతులకు అవగాహన కల్పించారు. గ్రామస్ధుల సందేహాలను నివృత్తి చేశారు. రెవెన్యూ అధికారులు చేపట్టే భూముల రీ సర్వేకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణి, అధికారులు పాల్గొన్నారు.