హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల్లో గెలవలేక అల్లర్లకు కుట్ర?: శివరాజ్ సింగ్

వికసిత్ భారత్‌ను కోరుకునే వారంతా ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విపక్షాలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నాయని విమర్శించారు. ప్రజలను మెప్పించలేక, ఎన్నికల్లో గెలవలేక దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.