హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీరు

NZB: వర్ని మండలంలోని జాకోర ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని శనివారం విడుదల చేశారు. ఈ నీరు మండలంలోని జాకోర, జలాల్పూర్ చెరువులకు చేరుతోంది. చెరువుల ద్వారా స్థానిక ఆయకట్టు రైతుల పంట పొలాలకు నీరు అందుతోంది. ఎండుతున్న పంట పొలాలకు సాగునీరు అందడంతో ఈ లిఫ్ట్ ద్వారా రైతులకు కొంత ఊరట లభించింది.