MDK: జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలోని గోకుల్ షెడ్లో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం విశేష పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరి, శైలపుత్రి దేవి రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
శరన్నవరాత్రులకు ముస్తాబైన ఏడుపాయల క్షేత్రం


