హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల రక్షణే ప్రధాన ధ్యేయం: ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతకు షీ టీం, పోలీస్ అక్క బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయని SP అఖిల్ మహాజన్ శనివారం తెలిపారు. నెలవారీ సమీక్షలో భాగంగా అందిన 136 ఫిర్యాదులపై స్పందించి 117 ఈ-పెట్టి కేసులు, 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వేధింపులు లేదా అత్యవసర వేళల్లో షీ టీం నంబర్ 8712659953 ను సంప్రదించాలని సూచించారు.