అన్నమయ్య: చిట్వేలి మండల వ్యాప్తంగా విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తొలగించారు. ప్రజలకు అంతరాయం లేని మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు పాకిన తీగలను, విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించినట్లు చిట్వేలి సెక్షన్ విద్యుత్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల భద్రతే లక్ష్యంగా విద్యుత్ శాఖ చర్యలు


